UPDATES  

NEWS

 హైదరాబాద్‌కు జనవరి నుంచి 8 నెలల పాటు తీవ్ర నీటి కష్టాలు..!

హైదరాబాద్ నగరానికి 8 నెలల పాటు తీవ్ర నీటి కష్టాలు తప్పవని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. మంజీరా, సింగూరు జలాశయాలు అడుగంటిపోవడంతో సుమారు రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటి కొరత ఏర్పడనుందని ఆయన తెలిపారు. ఈ ప్రభావం వచ్చే ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుందని హెచ్చరించారు.

ప్రాజెక్టులలో నీటి మట్టాలు పడిపోవడం, భూగర్భ జలాలు తగ్గడంతో సమస్య తీవ్రంగా మారిందని అశోక్ రెడ్డి వివరించారు. ఈ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నుంచి 100 MGD, కృష్ణా నది నుంచి 10-15 MGD, ఉస్మాన్‌సాగర్ నుంచి మరో 5 MGD నీటిని నగరానికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ చర్యల ద్వారా 60 శాతం కొరతను భర్తీ చేయగలిగినా, మరో 20 నుంచి 40 శాతం నీటి ఎద్దడి కొనసాగుతుందని ఆయన అంగీకరించారు.

ఈ నీటి సంక్షోభం ప్రభావం నగరంలోని ఏడు నియోజకవర్గాలపై అధికంగా ఉంటుందని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లిలో 80 శాతం వరకు నీటి సమస్య ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే పటాన్‌చెరు నుంచి నార్సింగి వరకు ఉన్న ప్రాంతాల్లో సుమారు 3 లక్షల కనెక్షన్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పవని తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |