UPDATES  

NEWS

 కరీంనగర్‌కు రానున్న నితిన్ నబీన్.. భారీ పాదయాత్రకు బిగ్ ప్లాన్..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న వివిధ యాత్రలు, కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్‌లో కూడా పర్యటించి, యాత్ర నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కోరారు. కాగా తన విజ్ఞప్తికి నితిన్ నబీన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నితిన్ నబీన్ కు అర్వింద్ వివరించారు. జాతీయ స్థాయి నాయకత్వం నిజామాబాద్‌లో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొనడంతో పాటు, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాగా దీనిపై సానుకూలంగా స్పందించిన నితిన్ నబీన్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, పర్యటన తేదీలు, కార్యక్రమాలు ఖరారైన వెంటనే నిజామాబాద్‌లో కూడా యాత్ర నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానని ఎంపీకి తెలిపారు.

జాతీయ అధ్యక్షుడు తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడంపై ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ పర్యటన ఖరారైన అనంతరం నిజామాబాద్ పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు, కార్యక్రమాల రూపకల్పనపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ఇదిలాఉండగా దీపావళి తర్వాత నితిన్ నబీన్ కరీంనగర్ కు వస్తున్నారు. అయితే అదే రోజు రెండు పాదయాత్రలు కవర్ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు యాత్రలు కవరయ్యేలా షెడ్యూల్ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |