UPDATES  

NEWS

 మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి..!

మూడో తరగతి చదువుతున్న బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్‌ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎటికెల రాజశేఖర్‌ అలియాస్‌ చిన్నా (27)కు ఈ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి కె.వెంకటేష్‌  తీర్పు వెలువరించారు.

2019లో అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖానాజిగూడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజశేఖర్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధించారు. బాధిత బాలుడికి రూ.3 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్‌ పి.యాదగిరి, రెండో దర్యాప్తు అధికారిగా ఏసీపీ ఏవీఆర్‌ నరసింహారావు వ్యవహరించారు. ప్రస్తుతం అల్వాల్‌ సీఐగా ఉన్న ప్రశాంత్‌ కూడా కేసు ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రభాకర్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసు వివరాలను గురువారం ఆయన మీడియాకు వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |