UPDATES  

NEWS

 CJP నేతకుషాక్..! పౌరసత్వంపై విచారణకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ నేపథ్యం, జాతీయత గుర్తింపుపై దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, యూఐడీఏఐ, చెన్నై రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.

తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందిన వ్యాపారి గణేష్ ఇటీవల కుమార్ సౌరవ్ దాస్ జాతీయత, తల్లిదండ్రుల వివరాలు, వ్యక్తిగత నేపథ్యంపై సమగ్ర విచారణ జరపాలంటూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ అరుళ్ మురుగన్‌ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ దాఖలు చేసిన పిటిషనర్ సౌరవ్ దాస్ విదేశీయుడని తేలితే ఆయన పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులను రద్దు చేయాలని కోరారు.

న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అగౌరవకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ సౌరవ్ దాస్ ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేయాలన్నారు. ఈ పిటిషన్‌పై స్పందనలు తెలియజేయాలని నోటీసులు జారీ చేసిన ధర్మాసనం హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |