UPDATES  

NEWS

 తీవ్ర తుపానుగా బలపడిన ‘అర్ణబ్’.. ఏపీ తీరం వైపు వేగంగా కదలిక..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణబ్’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోందని, దీని ప్రభావం రాష్ట్రంపై గణనీయంగా ఉండనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ తుపాను రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను, గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. ఇది విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు చెరో 490 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 560 కి.మీ, మచిలీపట్నంకు 660 కి.మీ, బాపట్లకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. రేపు సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, ఆ తర్వాత వాయువ్య దిశగా మలుపు తీసుకుంటుందని అంచనా వేశారు.

బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం 
ఎల్లుండి (బుధవారం) ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115-125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగానికి చేరే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలు, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుపాను నేపథ్యంలో రేపు కోస్తా తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్లు, భారీ హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రజలు ఈ నంబర్లను సంప్రదించి సహాయం పొందవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |