UPDATES  

NEWS

 వైసీపీ వెన్నులో వణుకు..? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి జోరు..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ వెన్నులో వణుకు పుట్టాయి. ఎలాగైనా ఎన్నికలను అడ్డుకునేందుకు చివరి వరకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. పోలింగ్‌కు ముందే 17 మున్సిపాలిటీల్లో కూటమి జెండా రెపరెపలాడింది. కూటమి దెబ్బకు దశాబ్దాల వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఫలితంగా ఆ పార్టీ కేడర్ కకావికలమై చేతులెత్తేసింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు జోరందుకున్నాయి. ఏపీ వ్యాప్తంగా 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఎస్ఈసీ ప్రకటించనుంది. కూటమి ఖాతాలోకి 17 మున్సిపాలిటీలు చేరాయి. అందులో టీడీపీకి 15, జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి పార్టీలు 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీల వారికీ ఏకగ్రీవమైన వార్డులను ఇప్పుడు చూద్దాం. టీడీపీ-660, జనసేన-38, బీజేపీ-28, వైసీపీ-19, సీపీఐ-1, ఇండిపెండెంట్లు-5 ఉన్నారు. వార్డుల్లో 21 శాతం, డివిజన్లలో 12.58 శాతం ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీకి పలుచోట్ల అభ్యర్థులు కరువయ్యారు. కూటమి-వైసీపీ నేతల మధ్య గొడవల కారణంగా ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు.

ఇక వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప విషయానికి వద్దాం. అక్కడ 8 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కూటమి పార్టీల అభ్యర్థులు ఆరు చోట్ల ఏకగ్రీవంగా ఛైర్‌పర్సన్లు ఎన్నికయ్యారు. కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన తీరును చూస్తుంటే క్షేత్రస్థాయిలో వైసీపీ పట్టు కోల్పోతున్నట్లు అర్థమవుతోంది.

కడప కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో 50 డివిజన్ల ఫలితాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో టీడీపీ-47 స్థానాలు, జనసేన ఒకటి, బీజేపీ రెండు స్థానాలను దక్కించుకున్నాయి. వైసీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీ విషయానికి వద్దాం. అక్కడ మొత్తం 40 వార్డులకుగాను 20 వార్డులు కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బద్వేలు మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులకు 39 వార్డులను కూటమి ఏకగ్రీవమైంది. అక్కడ చైర్‌పర్సన్ పదవిని టీడీపీ అభ్యర్థి దివ్య తేజ దక్కించుకున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మొత్తం 52 వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రామిరెడ్డి చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. కమలాపురంలో మొత్తం 23 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీకి చెందిన స్వప్న చైర్‌పర్సన్ పదవిని సొంతం చేసుకున్నారు.

యర్రగుంట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని బీజేపీ సొంతం చేసుకుంది. మొత్తం 28 వార్డులకు గాను 27 ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ- 18, బీజేపీ-9 వార్డులను గెలుచుకున్నాయి. బీజేపీకి చెందిన మధులత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

మైదుకూరులో మొత్తం 32 వార్డులకు 17 వార్డుల ఫలితాలు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ-16, జనసేన-1 వార్డులను సొంతం చేసుకున్నాయి. టీడీపీకి చెందిన ధనపాల జగన్ మోహన్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు.

రాజంపేటలో మొత్తం 32 వార్డులకు 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ- 12 వార్డులు, జనసేన, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒకొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీకి చెందిన దొంతం గాయత్రి చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |