UPDATES  

NEWS

 కర్నూలు లో వేడెక్కిన రాజకీయాలు..! తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్..!

కర్నూలు నగర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు తమ దారికి అడ్డంకులు సృష్టించడమే కాకుండా, ఊహించని రీతిలో ఘర్షణకు దిగారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రచార సమయంలో పరిస్థితి క్షణాల్లోనే హద్దులు దాటింది. హఫీజ్ ఖాన్‌తో పాటు ఆయన వెంట ఉన్న పార్టీ కార్యకర్తలను తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. చంపేస్తామని బెదిరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకున్నారు. పోలీసుల వాహనాలు రావడం చూసి బెదిరింపులకు దిగిన గుంపు అక్కడి నుంచి పరారైందని హఫీజ్ ఖాన్ వర్గీయులు తెలిపారు.

ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఇటువంటి బెదిరింపులకు, హెచ్చరికలకు తాము అస్సలు భయపడేది లేదని స్పష్టం చేశారు. బహిరంగంగానే మీసం తిప్పి, తొడ కొట్టి టీడీపీ నాయకులకు ఆయన గట్టి సవాల్ విసిరారు. కాగా, ఈ దాడి యత్నం, బెదిరింపుల వ్యవహారంపై ఈరోజు సాయంత్రం కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటనపై సమాచారం సేకరించిన పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |