UPDATES  

NEWS

 నా ప్రాణం తీద్దామని చూశారు..! కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) లక్ష్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌ది అత్యంత హీనమైన చరిత్ర అని, ఆయన చేసిన దోపిడీలు, చేసిన పాపాలకు లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయని మండిపడ్డారు. అంతేకాకుండా, కేటీఆర్‌కు మర్దర్లు చేసిన నేరపూరిత బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందన్నారు. గతంలో తన ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించారని ఎంపీ అరవింద్ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఎంపీ అరవింద్ స్పష్టత ఇచ్చారు. మైనార్టీలు ఓట్లు వేసినా, వేయకపోయినా తనే గెలుస్తానని తానే అన్నట్లుగా ఒక పాత వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిక్క కిషన్లు పోటీలో నిలబడితే… ఓట్లు పడినా పడకపోయినా గెలిచేది నేనే అని ఆ రోజు అన్నాను. నా మాటలను పూర్తిగా వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన వివరణ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని, కానీ తెలంగాణలో మాత్రం ఆ పథకాలను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మోదీ నాయకత్వానికి ఓటు వేస్తేనే అన్ని కేంద్ర సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలువుతాయని ఆయన తెలిపారు.

ఇదే క్రమంలో మాజీ ఎంపీ కవితపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో పాపం కవిత నాపై పోటీ చేసి ఓడిపోయింది. చివరికి ఆమె పార్టీ నుంచే కాకుండా ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు వేడెక్కిన వేళ, అరవింద్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |