UPDATES  

NEWS

 వరంగల్ కోట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. రూ. 382 కోట్లు మంజూరు..

కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్ కోట అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఖిల్లా వరంగల్‌తో పాటు హనుమకొండ నగరంలోని కీలక ప్రాంతాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 382 కోట్ల కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులతో ఖిల్లా వరంగల్ పునరుద్ధరణ, సెంట్రల్ ప్లాజా నిర్మాణం, బస్ టెర్మినల్, వేయి స్తంభాల ఆలయం పరిసరాల అభివృద్ధి, మ్యూజికల్ గార్డెన్ వంటి కీలక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ పనులన్నింటినీ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పర్యవేక్షణలో నిర్వహించనుండగా, ప్రాజెక్టుల అమలుకు ప్రపంచ బ్యాంకు నిధులను వినియోగించనున్నారు.

వరంగల్ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పర్యాటక రంగంలో వరంగల్ నగరానికి మరింత గుర్తింపు లభించడంతో పాటు, నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అధికారులు భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |