UPDATES  

NEWS

 ఎల్‌నినో ఎఫెక్ట్..! వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్..!

ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ పెట్టారు. మరో నెలల 8పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలపి ఇటీవలే సూచించారు. సాగునీటి సమస్య తలెత్తకుండా తక్కువ నీటితో పండే పంటల్నే వేయాలని రైతుల్ని కోరారు. పంట చేతికొచ్చే వరకు రైతులకు అవసరమైన నీరందించడం సహా కరెంట్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు విద్యుత్‌ కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఎల్‌ నినో ప్రభావాన్ని అధిగమించే ప్రణాళికలపై దృష్టి సారించింది. ఎల్‌నినో అంశంపై సీఎ రేవంత్‌ రెడ్డి కేబినెట్‌ సబ్‌ కమిటీతో కలిసి రివ్యూ చేయనున్నారు.

తెలంగాణలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ప్రజల్లో రైతుల్లో ఎల్‌నినోపై అవగాహన కల్పించడం సహా మరోవైపు కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తోంది. తెలంగాణ సర్కార్‌. నవంబర్‌ 1న అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎం రేవంత్‌ ఇప్పటికే ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా ఇకపై తాగునీటి బోర్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. నల్లాలకు మోటార్లు బిగిస్తే ఇక కఠిన చర్యలే. అక్రమ మోటార్లపై హైడ్రా సహకారంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది GHMC. నీరు,కరెంట్‌ పొదుపు విషయంలో అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.సాయంత్రం ఆరు తరువాత ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలను ఆఫ్‌ చేయాలని ఆదేశించింది.

మిషన్ భగీరథ ద్వారా 60 MGDల నీటిని అందించడంతో పాటు..అవసరమైతే కృష్ణా జలాలను మళ్లించనున్నారు. నవంబర్ 1 నుంచి నిర్మాణ రంగానికి STP శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. మరోవైపు విద్యుత్ కొరత రాకుండా థర్మల్ ప్లాంట్లలో గరిష్ట ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా రామప్ప చెరువు, డీఫ్లోరైడేషన్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారామె.. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింతగా ఫోకస్ చేసింది కాంగ్రెస్ సర్కారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులకు కార్యాచరణ సిద్ధం చేసింది. నవంబర్ రెండో వారంలో పనులు ప్రారంభించి.. 2027 వర్షాకాలం ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |