UPDATES  

NEWS

 అనకాపల్లిలో అక్రమ వసూళ్ల చెక్‌పోస్ట్ కలకలం..!

అనకాపల్లి మండల కేంద్రంలో ఏఎంఆర్ సంస్థ మైనింగ్ చెక్ పోస్ట్‌ల పేరుతో మాటూరు జంక్షన్‌ వద్ద అక్రమ చెక్‌పోస్టు ఏర్పాటు చేసి లారీలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని ఏబీ వెంకటేశ్వర్లు ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. అక్రమ రిజిస్టర్లు, స్టాంప్‌ ప్యాడ్లు ఏర్పాటు చేసుకుని రోజువారీగా దర్జాగా వసూళ్లు చేస్తున్నారని అన్నారు.

డబ్బులు చెల్లించకుండా వెళ్లే లారీలను మోటార్‌సైకిళ్లు, బొలేరో వాహనాలతో వెంబడించి అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని డ్రైవర్లు వాపోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సీనరేజ్‌ కలెక్షన్‌ పేరుతో ఇలాంటి వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ రిజిస్టర్లు, స్టాంపులు చెక్‌పోస్టు వద్దకు తాము వెళ్లిన సమయంలో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని, అక్కడ లభించిన అక్రమ రిజిస్టర్లు, స్టాంప్‌ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

వాటిని అనకాపల్లి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌‌కు ఫిర్యాదుతో పాటు అప్పగించినట్లు చెప్పారు. దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు భయపడకుండా అక్రమ వసూళ్లను ఎదిరించాలని, బాధితులకు ప్రజాసంఘాలు అండగా నిలవాలని కోరారు. పాలక, ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆయన విమర్శలు చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |