UPDATES  

NEWS

 కావలి జనసేనలో పాత-కొత్త నేతల ఆధిపత్య పోరు..!

పార్టీ బలోపేతానికి జనసేన అధినేత పవన్.. వైసీపీలోని అసంతృప్తి నేతలను చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సుకుమార్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానించారు. కానీ, ఆయన చేరికను జిల్లాలోని కొందరు జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఐదేళ్లపాటు వైసీపీ కేసులను ఎదుర్కొని, వేధింపులను తట్టుకొని నిలబడితే.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నేత సిద్దూ. జనసేన కోసం ఆవిర్భావం నుంచి నిలబడితే చివరికి తమకు దక్కేది ఇదేనా అని ప్రెస్ మీట్ పెట్టి మరీ అసంతృప్తి వ్యక్తం చేయడం నెల్లూరు జిల్లాలో హాట్ డిస్కషన్ కి దారి తీసింది.

కొత్తవారిని చేర్చుకోకుండా పార్టీ ఎలా బలపడుతుంది? ఈ మాత్రం సిద్దూకి తెలియదా? అనే ప్రశ్న దగ్గరే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనసేనలో చేరినప్పటి నుంచి సుకుమార్ రెడ్డి, ఆయన వర్గం బాగా యాక్టివ్ అయ్యారు. జనసేన కావలి బాధ్యతలు ఆయనకు ఇవ్వాలనే కోర్కెలు అభిమానుల నుంచి అధిష్టానానికి చేరాయట. ఈ కోర్కెలు సిద్దూ వర్గాన్ని కలవరపెడుతున్నాయి. ఇది చేరికల వ్యవహారం మాత్రమే కాదని.. జనసేన కావలి భవిష్యత్ నాయకత్వాన్నే మార్చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

సుకుమార్ రెడ్డి చేరికపై మరో ఇంట్రస్టింగ్ అంశం కూడా తెరపైకి వస్తోంది. కావలిలో గతంలో జరిగిన అక్రమ లే అవుట్ల వ్యవహారంలో ఆయనపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన పార్టీ మారారనే ఆరోపణలు కూడా చేస్తున్నవారు ఉన్నారు. అయితే, పాత జనసేన నేతలంతా సుకుమార్ రెడ్డి చేరికను వ్యతిరేకించడం లేదు.. ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి జనసేనలో పాత, కొత్త నేతలను పవన్ కల్యాణ్ ఎలా సంతృప్తి పరుస్తారు? రెండు వర్గాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది చూడాలి

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |