UPDATES  

NEWS

 ఖైరతాబాద్ ఉప ఎన్నికల పోటీలో కవితా..?

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున పోటీలో దిగుతున్నామని పార్టీ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కవిత విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇన్నాళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని, చేతల్లో శూన్యం అని ఆమె మండిపడ్డారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపిందని కవిత ఆరోపించారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ వివాదం వెనుక అసలు నిజాలు వేరే ఉన్నాయని, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమని వ్యాఖ్యానించారు...

కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, వార్తల్లో నిలవడానికి ప్రకటనలు ఇవ్వడం తప్ప ఫామ్‌హౌస్‌పై ఎలాంటి నిజమైన చర్యలు ఉండవని ఆమె ఎద్దేవా చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తీరతామని ఈ సందర్భంగా వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |