UPDATES  

NEWS

 ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్..!

కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించాడు. కర్నూలులో ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం చాలా సంతోషకరం అని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు, అనంతపురం ప్రజలు ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పైలట్లుగా ఎదగాలి. ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కర్నూలు విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రి టీజీ భరత్ కోరారు. కర్నూలు విమానాశ్రయంలో రన్‌వే పొడవు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసారు. డీజీసీఏ రీజినల్ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని టీజీ భరత్ కోరారు.

విమానయాన రంగంలో రాయలసీమ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని అన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విమానయాన మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా రాష్ట్రంతో పాటు పొరుగు ప్రాంతాల యువతకు పైలట్ శిక్షణ అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పైలట్లకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వనున్నారు. కర్నూలు విమానాశ్రయం నుంచి తొలి శిక్షణ విమానాన్ని ఫ్లాగ్‌ఆఫ్ చేసిన కార్యక్రమం మోదలు పెట్టారు. కర్నూలులో ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన శిక్షణ రంగానికి మరింత ఊతం లబించనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |