UPDATES  

NEWS

 వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. 11న పార్టీని ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి. .

వైసీపీలో తాను తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతోందని ఆయన ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 11వ తేదీన కొత్త పార్టీ పేరును వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ తన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. తన కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తామిద్దరం గతంలో టీటీడీ బోర్డులో కలిసి పనిచేశామని, ఆ అనుభవంతో పార్టీని ముందుకు తీసుకెళతామని అన్నారు. కాగా, ఓవీ రమణ టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తాను విజయసాయి పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే, రమణను విజయసాయి తన పార్టీలోకి స్వాగతించారు.

ఇక, నవంబర్ 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రకటించడంపై వస్తున్న ట్రోల్స్‌పైనా విజయసాయి స్పందించారు. “పండితులు సూచించిన ముహూర్త బలం ప్రకారమే ఆ సమయాన్ని ఎంచుకున్నాం. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. ఎవరో భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేను” అని ఆయన వివరణ ఇచ్చారు. తాను మెంటార్‌గా ఉంటూ అన్ని వర్గాల వారికి అధికారం కట్టబెట్టేలా పనిచేస్తానని, ప్రజల ఆశీర్వాదంతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత అన్ని జిల్లాల నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |