UPDATES  

NEWS

 కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇందుజా ఫిర్యాదు..! కారణం అదేనా. .?

కేటీఆర్ పై బల్మూర్ ఇందుజా ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. కేటీఆర్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఇందుజా ఫిర్యాదు చేసింది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫొటోలను తప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేసింది.

తన భర్త వెంకట్ బల్మూర్‌తో ఉన్న ఫొటోలను తప్పుగా చూపిస్తున్నారని ఆమే ఫిర్యాదులో పేర్కోంది. తనను, తన భర్త ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కులం, రాజకీయ హోదా ఆధారంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలని పోలీసులకు ఆమే విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఆధారాలను భద్రపరచి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇందుజా కోరారు. నాపై తప్పు ఆరోపణలు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇందుజ ఫిర్యాదు చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |