UPDATES  

NEWS

 ఏపీకి దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాన్..! ఏపీలో భారీ వర్షాలు..?

ఆంధ్రప్రదేశ్ అర్నబ్ తుపాన్ అతి వేగంగా కదులుతుంది. దీంతో అక్కడి ప్రాంత మంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉపరితల ప్రాంతం నండి భూభాగాన్ని తుపాను బాహ్య వలయం చుట్టూ అలుముకుంటుంది. దీంతో తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అయితే గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి వేగంగా తుపాన్ కదులుతుంది. విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మచిలీపట్నంకు 170 కి.మీ. బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి వుంది. ఈ తుఫాను ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.  ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో కురిసిన అతిభారీ వర్షాలు పడనున్నాయి. దీంతో దాదాపుగా 133 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే కాకినాడలో మంచి వర్షాలు ప్రారంభమవ్వగా, విశాఖపట్నంలో ఇప్పటికే 75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తుపాను మరింత బలపడుతుండటంతో రాబోయే 3 గంటల్లో విశాఖలో ఈదురుగాలులు గంటకు 40 కి.మీ, కాకినాడ-తుని ప్రాంతాల్లో గంటకు 30 కి.మీ వేగంతో వీచే అవకాశముందని రాత్రికి వీటి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |