UPDATES  

NEWS

 ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్..!

ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే  కరువును  ముందుగానే అంచనా వేసి తాగునీరు, సాగునీటి లభ్యతను కాపాడటంతో పాటు విద్యుత్‌ సరఫరా, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి వంటి కీలక రంగాలకు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల వారీగా సమగ్రంగా కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది.  నియమిత గడువు అక్టోబర్ 31 తేదీ లోగా రాష్ట్రంలోని కరువు మండలాలను ప్రకటించడంతో పాటు, ఎల్ నినో, కరువు పరిస్థితులను చర్చించడానికి అఖిల పక్ష సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్-నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,  కరవు ప్రభావిత మండలాలను. శాస్త్రీయంగా గుర్తించి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కరువు ప్రభావాన్ని తగ్గించి, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు సమయానికి అందించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరువు పరిస్థితులను శాస్త్రీయంగా విశ్లేషించి, అర్హత కలిగిన మండలాలను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే కరువు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు, 20 శాతానికి మించి కరువు ప్రభావం ఉన్న మండలాల పరిస్థితులను కూడా పరిశీలించాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశంపై సిఫార్సులు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కరువు ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉండబోతోందోముందుగానే అంచనా వేస్తే, ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించేందుకు వీలవుతుందని చెప్పారు. అందుకే ప్రతి శాఖ తన పరిధిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఇక  తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఇక ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్‌ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాఖ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరాయంగాఅందించేందుకు అన్ని శాఖలు తమ అవసరాలను ముందుగానే అంచనా వేయాలని, అత్యవసర ఖర్చుల కోసం ఆర్థిక శాఖ తగిన విధంగా సహకరించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు రానున్న పంటల సీజన్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగునుప్రోత్సహించాలని తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |