UPDATES  

NEWS

 మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని..!

పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత విడదల రజిని, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రజని కిందపడిపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఎడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయి, విడదల రజినిని కలిసేందుకు ఆమె నివాసానికి వచ్చారు. అయితే, ఇంటి గేటు వద్ద ఉన్న పోలీసులు బుల్లబ్బాయిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజని బయటకు వచ్చి, తమ మద్దతుదారుడ్ని ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక, విడదల రజనికి మధ్య వాగ్వాదం జరిగింది. తన మద్దతుదారుడి నామినేషన్‌కు సంబంధించిన బీ-ఫారం తన వద్ద ఉందని, మూడు రోజులుగా తమ వారిని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎస్ఐ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి విడదల రజని పక్కకు పడిపోయారు.

దీంతో విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎస్ఐపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “పిచ్చి పట్టిందా నీకు? నన్ను చంపుతావా నువ్వు? ఏం, మెంటలా నీకు? ఎవడు పంపించాడు నిన్ను ఇక్కడికి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రజని నివాసం వద్ద కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం, ఆమె తన మద్దతుదారులతో కలిసి అక్కడే నిరసనకు దిగారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |