UPDATES  

NEWS

 ఏఐతో భారత్‌కు భారీ ముప్పు..! మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడి హెచ్చరిక..

సైబర్ దాడుల విషయంలో భారత్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ పాలసీ డైరెక్టర్ నికోలస్ బట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉండగా, ఆసియాలో మూడో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ దాడుల తీవ్రత మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2026’లో ఆయన ఈ కీలక విషయాలు వెల్లడించారు. 

“భారత్‌కు ముప్పు చాలా వాస్తవమైనది. ఇది పదేళ్ల తర్వాత జరగబోయే ప్రమాదం కాదు, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న భద్రతా సవాలు” అని ఆయన నొక్కిచెప్పారు. తాము ప్రతిరోజూ 165 ట్రిలియన్ల టెలిమెట్రీ సిగ్నళ్లను విశ్లేషిస్తామని, 5 మిలియన్ల కొత్త మాల్‌వేర్‌లను అడ్డుకుంటామని, అందుకే తమకు ఈ ముప్పుపై స్పష్టమైన అవగాహన ఉందని వివరించారు.

భారత్‌కు పొంచి ఉన్న మూడు ప్రధాన ముప్పుల గురించి బట్స్ వివరిస్తూ, “చైనా కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టార్మ్ 3168’ అనే రాన్సమ్‌వేర్ సంస్థ, ఏఐ ఏజెంట్లను ఉపయోగించి దాడులకు పాల్పడుతోంది. అలాగే, డేటా దొంగతనం, గూఢచర్యం లక్ష్యంగా చైనా ప్రభుత్వ ప్రేరేపిత ‘స్టార్మ్ 0940’ పనిచేస్తోంది” అని తెలిపారు.

వీటితో పాటు, ‘ఈవిల్‌టోకెన్స్’ అనే సైబర్ ముఠా ఏఐ టూల్స్‌ను కేవలం 1,500 డాలర్లకే అమ్ముతోందని, దీనివల్ల 120 దేశాల్లో 10,000కు పైగా సంస్థలు ప్రభావితమయ్యాయని బట్స్ పేర్కొన్నారు. ఏఐని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు మరింత శక్తివంతంగా మారుతున్నారని తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |