UPDATES  

NEWS

 ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక..! ముప్పు తప్పదా..?

పర్యావరణానికి సంబంధించి ఒక షాకింగ్ హెచ్చరిక బయటికొచ్చింది. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న ‘పారిస్ అగ్రిమెంట్’ ఆశలు అడియాసలయ్యాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం.. ఈ 1.5 డిగ్రీల లిమిట్‌ను దాటడం ఖాయమని చెప్తోంది.

శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. పెరిగే ప్రతీ ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పర్యావరణానికి పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. మంచు దిబ్బలు కరిగిపోవడం, సముద్రాలు వేడెక్కడం వల్ల వాతావరణంలో తేమ పెరిగి, ఆకస్మిక మేఘవిస్పోటనాలు, ముంచెత్తే భారీ వరదలు, భీకరమైన తుఫానులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయి, నదులు ఎండిపోయి తాగునీటికి, వ్యవసాయానికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల పంటల దిగుబడి తగ్గిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. సముద్రాల్లో ఉండే 70 శాతం నుంచి 90 శాతం వరకు పగడపు దిబ్బలు పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉంది. టెంపరేచర్‌ను ప్రపంచదేశాలు అదుపులోకి తేవాలంటే… ఊహించని స్థాయిలో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. 2035 నాటికి రినోవబుల్ ఎనర్జీ అంటే సౌర, పవన్ విద్యుత్‌ని త్రిపుల్ చేయాలి, 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా బంద్ చేయాలి.

కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే దీనికి పూర్తిగా రివర్స్‌లో ఉంది. ప్రస్తుతం వివిధ దేశాలు ఇచ్చిన హామీల ప్రకారం చూస్తే 2030 నాటికి కేవలం 5 నుంచి 8 శాతం మాత్రమే ఎమిషన్స్ తగ్గుతాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఏకంగా 2.6 డిగ్రీల వరకు పెరిగే రిస్క్ ఉంది. ఇక అమెరికా లాంటి పెద్ద దేశాలు పారిస్ అగ్రిమెంట్ నుంచి తప్పుకోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దేశాలు ప్రస్తుత పాలసీలనే కంటిన్యూ చేస్తే.. టెంపరేచర్స్ 2.8 డిగ్రీల వరకు పెరిగి భయంకరమైన వాతావరణ మార్పులు ఎదురవుతాయి. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ఈ తీవ్రమైన హెచ్చరికల మధ్య వచ్చే నెల టర్కీలో జరగబోయే COP31 సమ్మిట్‌లో ప్రపంచ నాయకులు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |