UPDATES  

NEWS

 వెండి బతుకమ్మపై ట్రోలింగ్‌.. పీవీ సింధు ఘాటు సమాధానం..!

బతుకమ్మ సంప్రదాయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయొద్దని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. వెండి బతుకమ్మను బహుమతిగా అందించడంపై జరుగుతున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చింది. అది తన అత్తగారు చూపిన ప్రేమకు గుర్తు అని స్పష్టం చేసింది.

తన పుట్టింట్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ జరుపుకొనే ఆచారం లేదని సింధు తెలిపింది. అందుకే ఈ ఏడాది బతుకమ్మ పండుగ తనకు మొదటిసారి అని పేర్కొంది. తెలంగాణకు చెందిన కరీంనగర్‌ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఈ వేడుకలో పాల్గొన్నట్లు వివరించింది.

పండుగ కోసం వెనుక కనిపిస్తున్న పెద్ద పూల బతుకమ్మను తానే రోజంతా కష్టపడి పేర్చినట్లు చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నట్లు వెల్లడించింది.

వెండి బతుకమ్మను తన అత్తగారు ఆప్యాయంగా అందించారని సింధు వివరించింది. తనకు ఎంతో ఇష్టమైన సంప్రదాయంలోకి కొత్త కోడలిని సాదరంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఆ బహుమతి ఇచ్చారని తెలిపింది. సంప్రదాయంతో పాటు తల్లి ప్రేమకు కూడా చోటు ఉంటుందని ఆమె పేర్కొంది.

సింధు స్పందనకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయం వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |