UPDATES  

NEWS

 భారత్‌లోని ప్రతి ముస్లిం పూర్వీకులు రాముడు, కృష్ణుడే.. రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు..

యోగా గురు బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని ముస్లింలందరూ మతం మారినవారేనని, శ్రీరాముడు, శ్రీకృష్ణులను తమ పూర్వీకులుగా గుర్తించాలని వ్యాఖ్యానించారు. బుధవారం మధురలో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆశించడం లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై రాందేవ్‌ స్పందించారు.

“మన ప్రాచీన రుషులు, శ్రీరామకృష్ణులు తమ పూర్వీకులేనని ముస్లిం సోదరులందరూ   గుర్తించాలి. తమ మూలాలతో అనుసంధానమైతే వారు ఎన్నటికీ బలహీనంగా భావించరు” అని రాందేవ్‌ పేర్కొన్నారు. హిందూ-ముస్లింలు ఐక్యంగా ఉంటేనే దేశం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదే తరహా వ్యాఖ్యలను గతంలో బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి.

రేవంత్ వ్యాఖ్యలపైనా స్పందన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు’ అనే వ్యాఖ్యలపై కూడా రాందేవ్‌ స్పందించారు. సనాతన ధర్మంలో కులం, వర్గం పేరుతో కొందరు విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాముడు, కృష్ణుడు, శివుడు, హనుమంతుడు అందరూ ఒక్కటేనని, దేవుడి పేరుతో గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |