UPDATES  

NEWS

 కరవులో రైతాంగం.. దోపిడీలో కూటమి ప్రభుత్వం: పేర్ని నాని..

అధికార పీఠం ఎక్కేందుకు ఊహాజనిత హామీలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పూర్తిగా పక్కనబెట్టేసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందక, సరైన ప్రణాళికలు లేక కరవు కోరల్లో చిక్కుకుని రైతాంగం అల్లాడిపోతుంటే… కూటమి నాయకులు మాత్రం పాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని దోచుకోవడంలో నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు.

గతంలో జగన్ అందించిన పారదర్శక సంక్షేమ పథకాల కంటే మిన్నగా పథకాలు ఇస్తామంటూ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఇప్పుడు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలు, మోసపూరిత వైఖరిపై నియోజకవర్గాల వారీగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో బాధితులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని గుర్తుచేశారు. ఈ ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకే కూటమి నాయకత్వం ప్రతిరోజూ కొత్త నాటకాలకు తెరలేపుతోందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని పేర్ని నాని హెచ్చరించారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |