యూట్యూబర్ ప్రశ్న రావణ్ విచారణ ఎంతవరకు వచ్చింది? జరుగుతున్న పరిణామాలతో అప్రూవర్‌గా మారేందుకు రెడీ అవుతున్నారా? అదే జరిగితే ఈ ఉచ్చులోకి చిక్కుకునేది ఎవరు? మూడు రోజుల పోలీసుల కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలోని ఈ మధ్యకాలం వార్తల్లో నలుగుతున్నారు యూట్యూబర్ ప్రశ్న రావణ్. అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలకు ఆయన తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన అప్రూవర్‌గా మారేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆయన వెనుకున్న వ్యక్తుల మెడకు ఈ కేసు చుట్టుకోవడం ఖాయమనే వాదనల ఏపీలో బలంగా వినిపిస్తోంది.
తనను రెచ్చగొట్టి జైలు పాలైన తర్వాత బయటకు వస్తానో రానో తెలియని కేసుల్లో ఇరుక్కున్నారు రావణ్. దీనికి కారణమైన వారందరి గురించి రావణ్ కస్టడీలో పూర్తి వివరాలు పోలీసులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్‌ను టార్గెట్ చేయడానికి వెనుక జరిగిన కుట్ర, ఫండింగ్ వివరాలను బయట పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కొందరు నేతల ఫండింగ్, మేధావుల ప్రోత్సాహంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కస్టడీలో రావణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కొందరిపై చర్యలు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.







