UPDATES  

NEWS

 కృష్ణా నీటి వాటాపై సంచలన నిజాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్..!

కృష్ణా జలాల్లో తీవ్ర నష్టం చేసింది BRS. BRS కు మాటలు ఎక్కువ పని తక్కువ అని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. జూరాల రెండు పక్కల తెలంగాణ ఉంది. జూరాలలో 70 TMC లతో ప్రాజెక్ట్ డిజైన్ చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవో ప్రకారం మనకు నీటివాటా హక్కు ఎక్కవ ఉందని అన్నారు. కానీ వాటర్ సోర్స్ మార్చారు. డిజైన్ మార్చారు. భూ సేకరణ లేకుండానే 55వేల కోట్లతో DPR సమర్పించారని అన్నారు. కానీ అది 75వేల కోట్లకు పెరుగుతుందని, కమిషన్ల కోసం ప్రాజెక్టుల డిజైన్ మార్చారని ఫైర్ అయ్యారు.

జూరాల దగ్గరే ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఫ్లడ్ వాటర్ వాడుకునే అవకాశం ఉండేది. 1లక్ష 88 వేలు ఖర్చు పెట్టీ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని అన్నారు. BRSకు మాట్లాడే అర్హత ఉందా.. కృష్ణాలో 286.78 TMC నీరు తెలంగాణ వాడుకుంది. ఎల్ నినో వచ్చిందని BRS సంబర పడుతుందని అన్నారు. ప్రాజెక్టులు సరిగా కట్టి ఉంటే ఎల్ నినో వచ్చినా నీటి సమస్య ఉండేది కాదని అన్నారు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో నీటి కష్టాలకు ఎల్ నినో ఎంత కారణమో, తెలంగాణ అంతే కారణం అని, 2028జూన్ నాటికి SLBC పూర్తి చేస్తామని మంత్రి ఉత్తం క్లారిటీ ఇచ్చారు.3

BRS హయాంలో సంపాదన కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నట్లుగా చూశారు. కర్ణాటక సీఎంతో సీఎం రేవంత్ నేను మాట్లాడామని, జూరాలకు నీరు ఇవ్వమని కోరామన్నారు. దీంతో ఆయన స్పందించారన్నారు. కుట్ర పూరితంగా BRS హయాంలో పాలమూరు రంగారెడ్డి నిర్మాణం జాప్యం చేశారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఇబ్బంది పడితే BRS సంతోష పడుతుందని, BRS ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజల మేలు కోసం మేము పనిచేస్తాంమని అన్నారు. ఎల్ నినో నేపద్యంలో తాగు నీటి కోసం కొంత స్టోరేజ్ చేస్తున్నామని, నాగార్జున సాగర్ నుంచి నీరు వదలాలో వద్దో మాకు తెలుసని అన్నారు. నేతల అక్రమ ఆస్తుల సంపాదనను సభ్య సమాజం ఖండించాలని క్లారిటీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |