UPDATES  

NEWS

 తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా..? మరి జంతువుల కొవ్వు మాటేంటీ..?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈడీ ప్రెస్ నోట్‌లో ‘జంతువుల కొవ్వు’ అనే పదం లేకపోవడంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి.

దీంతో తిరుమల లడ్డూలో అసలు ఏం జరిగింది? జంతువుల కొవ్వు ఉందా? లేదా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న కి పెట్టె ప్రసాదంలో నెయ్యికి బదులు విషపూరితమైన కెమికల్స్ వాడారని చెబుతుంటే వైసీపీ ,వారి మద్దతుదారులు మాత్రం ఈడీ ఇందులో ఎక్కడా జంతుల కొవ్వు లేదని తేల్చేసిందని పోస్టులు పెట్టడం గమనార్హం.అసలు పెట్టిన ప్రసాదమే విషపూరితం అని ఈడీ కుండబద్దలు కొట్టేస్తుంటే ఆవిషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా ఇంకా అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అని వెతుకుంటున్నాయట వైసీపీ వర్గాలు .

నిజానికి ఈడీ చేసిన ప్రకటన ఒకటి , సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరొకటి .అవును .. ఈడీ చేసిన ప్రకటనలో జంతువుల కొవ్వు ప్రస్తావన లేదు.కరెక్టే ..కానీ అసలు ఆ ప్రసాదంలో నెయ్యికి బదులుగా విషయపూరిత రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్‌తో పాటు మరికొన్ని పదార్థాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. MG-90, మోనోగ్లిజరైడ్స్, Myvacet Soft 400, Acetic Acid Ester వంటి పదార్థాల ని ఉపయోగించిన ఉత్పత్తిని ‘Agmark Special Grade Cow Ghee’ పేరుతో సరఫరా చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

అంటే..ఇందులో జంతువుల కొవ్వు కన్నా విషపూరిత పదార్థాలు ఉన్నాయి  మొర్రో.. అంటే లేదు లేదు ఈడీ ఎక్కడా జంతుల కొవ్వు లేదని తేల్చేసింది అంటూ వైసీపీ వాళ్ళు చంకలు గుద్దుకుంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.దీంతో మరో వర్గం వైసీపీ పై అదే రేంజ్ లో సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయి.జంతువుల కొవ్వు లేదని సంబరపడుతున్నారు ’‘ఆ ఒక్క మాట లేకపోతే మొత్తం కథ క్లోజ్ అయిపోయినట్టేనా..?’‘ఈడీ చెప్పిన మిగతా విషయాలు కనిపించడం లేదా..? ఈడీ చెప్పిన మిగతా పదార్థాల సంగతేంటి..?’అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కేసులో సుకృతి ఫుడ్స్‌కు చెందిన కైలాష్ చంద్ర మంగ్లాను ఈడీ అరెస్ట్ చేసింది.2019 నుంచి 2024 మధ్య టీటీడీకి జరిగిన సరఫరాలకు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంది .పైగా ఇందులో దాదాపు రూ.230 కోట్ల విలువైన సరఫరాల్లో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది కూడా .

ఒక పక్క కేసు చాలా సీరియస్ అంటూ దర్యాప్తు ఇంకా కొనసాగిస్తుంటే.. అబ్బే మీరు ఇన్ని రోజులుగా చేస్తున్న జంతువుల కొవ్వు ఉంది అన్న ఆరోపణలు అబద్దం అయిపోయాయి అంటూ వైసీపీ వర్గాలు సంబరపడిపోతుండటం బాధాకరం.

మొత్తానికి..తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగిందనే చెప్పాలి.ఒకవైపు ‘జంతువుల కొవ్వు లేదు’ అంటూ ప్రచారం..మరోవైపు ఇందులో అంతకు మించిన విషపూరిత కెమికల్ ఉన్నాయన్న ఈడీ ఆరోపణలు .చూడాలి మరి ముందు ముందు ఈ ప్రసాదం వ్యవహారం మరెన్ని మలుపులు తీసుకుంటుందో !

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |