UPDATES  

NEWS

 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. నాంపల్లి సీనియర్ సివిల్ కోర్టు ఇచ్చిన అరెస్ట్, రిమాండ్ నిరాకరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, ఈ వ్యవహారంలో తమ సమాధానాన్ని వివరణాత్మకంగా కౌంటర్ దాఖలు చేయాలని ఇద్దరు ఎమ్మెల్సీలకు అధికారిక నోటీసులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోర్టు ఎదుట వాదనలు వినిపిస్తూ, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అత్యంత అనుచిత పదజాలంతో దూషించడమే కాకుండా… విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులపై కూడా దాడులకు తెగబడ్డారని తెలిపారు. వీరిద్దరి అరెస్టును, రిమాండ్‌ను అడ్డుకుంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. ఇరు వర్గాల ప్రాథమిక నివేదికలను పరిశీలించిన హైకోర్టు, తదుపరి స్పష్టత కోసం ఎమ్మెల్సీల కౌంటర్ దాఖలుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |