UPDATES  

NEWS

 హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు దానం నాగేందర్..!

సుప్రీంకోర్టును నేడు దానం నాగేందర్ ఆశ్రయించారు. అతనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో దానం నాగేందర్ సవాల్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ ఫైల్ చేసిన దానం నాగేందర్ దీంతో ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది.

నిన్న దానం నాగేందర్ పై అనర్హత వేటు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ బిఆర్ఎస్ దాఖలు చేసింది. అనర్హత పై దానం నాగేందర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉండడంతో ముందుగానే కెవియట్ పిటిషన్ బిఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది.

అయితే దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినిపించడానికి కెవియట్ పిటిషన్ బిఆర్ఎస్ వేసింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీకి దిగడంతో దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసంది. ఇప్పుడు దీన్ని సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |