UPDATES  

NEWS

 బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..

ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని, అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్‌ నేతల్లో అహంకారం తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ సభ్యులు పోలీసులు, ప్రజాప్రతినిధులను దూషించడమే కాకుండా, మహిళా అధికారుల ముందే టీ-షర్టులు తీసి అసభ్యంగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. స్పీకర్‌పై అత్యంత అభ్యంతరకర భాషను ఉపయోగిస్తూ, సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించారని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రతిపక్షాల కుతుంత్రాలను బలంగా తిప్పికొట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరై, చర్చల్లో చురుకుగా పాల్గొనాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |