UPDATES  

NEWS

 అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా..!

అయోధ్య రామ మందిరానికి నూతన సీఈవో గా జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆపరేషన్ సింధూర్ హీరో, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా రామ్ మందిర్ తొలి సీఈఓగా కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. రామమందిర పరిపాలనను మరింత పారదర్శకంగా, వృత్తిపరంగా నిర్వహించేందుకు ట్రస్ట్ చరిత్రలోనే మొదటిసారి ఒక CEO పదవిని సృష్టించి మిశ్రాను ట్రస్టు ఎంపిక చేసింది.

భారత వైమానిక దళంలో 38 సంవత్సరాలకు పైగా విశేష సేవలందించిన జితేంద్ర మిశ్రా, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా వ్యూహాత్మక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. దేశానికి చేసిన సేవలకు గాను సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్ (SYSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM), మరియు విశిష్ట సేవా మెడల్ (VSM) బహుమతులను జితేంద్కర మిశ్రా అందుకున్నారు.

ఈ పోస్టు కోసం దాదాపు 5,500కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసింది. దీంతో చివరకు జితేంద్ర మిశ్రాను ఈ అత్యున్నత పదవికి ట్రస్టు ఎంపిక చేసింది. రామమందిరానికి సంబంధించిన పరిపాలన, ఆర్థిక, మరియు చట్టపరమైన వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను నూతన సీఈఓ అయిన జితేంద్ర మిశ్ర చూసుకోనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |