UPDATES  

NEWS

 ఫేక్ స్వామీజీ ఘరానా మోసం..! ఆశ్రమం ముసుగులో దందా..!

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ ఫేక స్వామీజీ బండారం బట్టబయలైంది. సంతాన ప్రాప్తి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తానంటూ నమ్మించి అమాయకులైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ దంపతుల వద్ద దాదాపుగా రెండు కోట్లకు పైగా డబ్బు కాజేసిన సంఘటన కలకలం రేపుతుంది.

ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మేళ్ళచెరువు సమీపంలో నైమిసారణ్యం ఆశ్రమం నిర్వహిస్తూ రమణ పొలకల స్వామి అలియాస్ రమణానంద మహర్షి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్టు దంపతులు పేర్కోన్నారు. అయితే బెంగళూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు శ్యామల, ఆనంద దంపతులకు పదేళ్లుగా సంతానం లేదు. దీంతో దీన్ని ఆసరగా చేసుని దందాకు తెరలేసినట్టు దంపతులు పేర్కోన్నారు. మధ్యవర్తులైన శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి అనే వ్యక్తులు స్వామీజీ చాలా శక్తిమంతుడని ఈయన వద్దకు వెలితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని దంపతులను నమ్మించారు.

మంచి జరగడం కోసం కొన్ని హోమాలు, ప్రత్యేక పూజలు, వాస్తు దోషాలు, డైట్ ప్లాన్ల పేరుతో స్వామీజీ విడతల వారీగా భాదితుల నుండి భారీగా నగదును గుంజాడు. అంతటితో ఆగకుండా వారితో త్రీబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను సైతం అమ్మించి దాదాపు 800 గ్రాముల బంగారాన్ని కాజేసాడు. దీంతో మోత్తం ఆ దంపతులు వద్ద రూ. 2 కోట్ల 17 లక్షల వరకు వసూలు చేసాడని భాదితులు వాపోయారు.

అయితే వారి సమస్య తీరక పోవడంతో పాటు, భాదితుని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడం, తనకు మరోసారి గర్భస్రావం జరగడంతో మోసపోయామని దంపతులు గ్రహించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తమ ఆస్తులు, నగదు వెనక్కి ఇవ్వాలని కోరితే స్వామీజీ వారిని అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు దంపతులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరతున్నారు. భాద్యులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |