UPDATES  

NEWS

 ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.. ఉస్మానియా వేదికగా డిమాండ్

తెలంగాణలోని ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలంటే అన్ని విద్యాసంస్థల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, తెలంగాణ మాల సంఘాల చైర్మన్ మందాల భాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

వక్తలు మాట్లాడుతూ ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా విధాన నిర్ణయాలు చేపట్టాలని వారు కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |