UPDATES  

NEWS

 Mobile Recharge Hike: మొబైల్ రీఛార్జ్ ధరలకు మళ్లీ షాక్?.. 15% వరకు పెరిగే అవకాశం!

మొబైల్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మరోసారి షాక్ తగిలే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదికలో అంచనా వేసింది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మొబైల్ టారిఫ్‌లు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

టెలికాం కంపెనీలు గతంలోనూ తమ టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచిన నేపథ్యంలో తాజా అంచనాలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రీఛార్జ్ ధరలు పెరిగితే నెలవారీ, వార్షిక ప్లాన్లపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉన్న ప్లాన్ల ధరల్లో మార్పులు వస్తే వినియోగదారుల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం రీఛార్జ్ ధరల పెంపుపై రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో 12-15 శాతం పెంపునకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం కేవలం అంచనాలు మాత్రమేనని గమనించాలి. టెలికాం కంపెనీలు అధికారికంగా ప్రకటించిన తర్వాతే కొత్త టారిఫ్‌లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |