UPDATES  

NEWS

 Factory Accident: యాద్గిరి ఫ్యాక్టరీలో విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికులు మృతి

కర్ణాటకలోని యాద్గిరి జిల్లా కడేచూరు పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక సీఐఎల్ ల్యాబొరేటరీ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన రసాయనం లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రసాయన లీకేజీ సంభవించడంతో ప్రమాదకరమైన వాయువులు వేగంగా గాలిలో కలిసినట్లు సమాచారం. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన విక్రమ్ సింగ్, సంజయ్ సింగ్, తెలంగాణకు చెందిన గణేష్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదాన్ని గుర్తించిన తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన మరో ఇద్దరు కార్మికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. రసాయనం ఎలా లీకైంది, ప్రమాదానికి అసలు కారణాలేంటి అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |