UPDATES  

NEWS

 పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ ఖతం.. పీఓకేలో ‘అజ్ఞాత వ్యక్తుల’ ఆపరేషన్..!

2019 పుల్వామా ఉగ్రదాడి మాస్టర్‌మైండ్స్‌లో ఒకడైన హంజా బుర్హాన్ అలియాస్ ‘డాక్టర్’ హతమయ్యాడు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 

చదువు పేరుతో వెళ్లి ఉగ్రవాదిగా..

హంజా బుర్హాన్ అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. పుల్వామా జిల్లా రత్నిపోరా ప్రాంతానికి చెందిన అతడు 2017లో ఉన్నత చదువుల కోసమంటూ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘అల్-బదర్’లో చేరి కమాండర్‌గా ఎదిగాడు. తర్వాత కశ్మీర్‌లోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, వారిని తీవ్రవాదులుగా మార్చడానికి దక్షిణ కశ్మీర్‌లో పెద్ద నెట్‌వర్క్ నడిపినట్లు రికార్డులు చెబున్నాయి.

 

పేలుడు పదార్థాలు సరఫరా

2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులకు హంజా బుర్హానే పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు సరఫరా చేసినట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. దీనితో పాటు 2020లో జరిగిన మరో గ్రెనేడ్ దాడిలోనూ ఇతడి ప్రమేయం ఉంది. దీనిపై భారత హోంమంత్రిత్వ శాఖ 2022లోనే ఇతడిని ‘ఉగ్రవాది’గా ప్రకటించింది.

 

పాక్‌లో మాయమవుతున్న ఉగ్రవాదులు

గత రెండేళ్లుగా పాకిస్థాన్, పీఓకే పరిధిలో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థల టాప్ కమాండర్లను ‘అజ్ఞాత వ్యక్తులు’ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. గత నెలలోనే లష్కరే వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజా లాహోర్‌లో హతమవగా.. జైషే చీఫ్ మసూద్ అజార్ అన్న తాహిర్ అన్వర్ కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |