UPDATES  

NEWS

 నేను ఢిల్లీకి రాగానే జైలుకు పంపుతారేమో అనిపిస్తోంది: కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు..

మన దేశంలో సునామీ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను అమెరికా నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే, పోలీసులు నన్ను నేరుగా తిహార్ జైలుకు తీసుకెళతారనిపిస్తోంది” అని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చుతూ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్టిన ఈ వ్యంగ్య డిజిటల్ ఉద్యమం… కేవలం 5 రోజుల్లోనే 1.4 కోట్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లతో బీజేపీ, కాంగ్రెస్ అకౌంట్లను దాటేసింది.

 

గూగుల్ ఫామ్ ద్వారా ప్రారంభమైన ఈ పార్టీలో మహువా మోయిత్రా, మనీష్ సిసోడియా వంటి ప్రతిపక్ష నేతలు కూడా చేరారు. అయితే, లీగల్ డిమాండ్ల కారణంగా ఈ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై అభిజీత్ స్పందిస్తూ.. “ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నేనేమీ సంతోషంగా లేను. ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అసలు సమస్యలు మారిపోవు కదా” అని విశ్లేషించారు. ఏది ఏమైనా కోట్ల ఫండింగ్ లేకుండా కేవలం మీమ్స్‌తో ఈ పార్టీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |