UPDATES  

NEWS

 ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా..!

ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా వేసారు. పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మురసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు లేని రహదారి సౌకర్యాలు కాజ్ వే లపై నీరు ప్రవహిస్తూ, రహదారులు కూడా గండి పడడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు 5వ తేదీన జరగవలసిన పోలింగ్, 6 తేదీకి వాయిదా వేస్తు ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం లో వరద ముంచెత్తింది.. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ వద్ద వరద నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఫైర్ సిబ్బంది సమిష్టిగా కృషిచేసి పోలింగ్ సిబ్బందిని బయటికి తీసుకువచ్చారు. గోపాలపురం మార్కెట్ యార్డ్ నుండి సిబ్బందిని వేరొక ప్రాంతంలో కళ్యాణ మండపానికి తరలించేమంటున్నారు కొవ్వూరు డిఎస్పి దేవకుమార్.. ఉన్నతాధికారులు సూచనల మేరకు ఎన్నికల సిబ్బందిని సంరక్షించడం ప్రధాన బాధ్యత అని కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |