- ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్ దిశగా!
- 70 మున్సిపాలిటీల్లో 58 చోట్ల కూటమి విజయం.. 13 కార్పొరేషన్లలో 13 కూటమికే!
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీ-ప్యాక్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
70 మున్సిపాలిటీల్లో కూటమికి 58!
సీ-ప్యాక్ అంచనాల ప్రకారం మొత్తం 70 మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ 42, జనసేన 14, బీజేపీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్సార్‌సీపీ 12 మున్సిపాలిటీలకే పరిమితమయ్యే అవకాశముందని సంస్థ అంచనా వేసింది.
13 కార్పొరేషన్లలో కూటమిదే ఆధిపత్యం!
రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ 10, జనసేన 2, బీజేపీ ఒక కార్పొరేషన్‌ను కైవసం చేసుకునే అవకాశముందని సీ-ప్యాక్ వెల్లడించింది.
టీడీపీకి విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, తిరుపతి సహా మొత్తం 10 కార్పొరేషన్లు దక్కే అవకాశముంది. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లలో జనసేన, అనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ?
ఈ అంచనాలు నిజమైతే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూటమి పట్టు మరింత బలపడినట్లవుతుంది. ముఖ్యంగా టీడీపీ ప్రధాన శక్తిగా నిలవడంతో పాటు జనసేన, బీజేపీ కూడా కీలక కార్పొరేషన్లలో విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇవి ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రమే. అసలు ఫలితాలు అధికారిక ఓట్ల లెక్కింపు అనంతరం వెల్లడికానున్నాయి.








