UPDATES  

NEWS

 పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం..! గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ..?

అన్నమయ్య జిల్లా పుంగనూరుకు ఎంపీ మిథున్‌ రెడ్డి చేరుకున్నారు. దీంతో ఏడు వాహనాల కాన్వాయ్‌తో పట్టణానికి వచ్చిన ఎంపీ ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఎంపీని ఆపేందుకు ప్రయత్నం చేసామని అన్నారు. దీంతో బీఆర్జేసీ కళాశాల వద్ద గేటును ఢీకొట్టి లోపలికి వాహనాలు వెల్లినాయి. ఆర్వో గదిలోకి వెళ్లిన ఎంపీతో పాటు చాలామంది వెళ్లారు. అయితే.. వాహనాల్లో వచ్చిన కొందరు మారణాయుధాలతో ఘర్షణకు దిగారని కర్నూల్ రేంజ్ డిఐజి తెలిపారు.

కే సాయికుమార్‌రెడ్డి, కే జస్వంత్, షేక్ ఇస్మాయిల్, పుట్టా వంశీకృష్ణ తదితరులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో డీఎస్పీ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు చేశారు. అనంతరవ ఎంపీని తన వాహనంలో సురక్షితంగా ఎస్పీ ఎంపీని పట్టనం దాటించారు. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన 13 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడి ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

అయితే డీఎస్పీ ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మొత్తం మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తునట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో ఎవరున్నా వారిని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. దీంతో అక్కడి కొంత సేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని పోలీసు అధికారు తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |