UPDATES  

NEWS

 మున్సిపల్ పోరుకు వైసీపీ అభ్యర్థులు ఖరారు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సమరానికి వైసీపీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం అధికారికంగా పత్రికా ప్రకటన ద్వారా అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.

7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులు వీరే:
వైసీపీ ప్రకటించిన జాబితా ప్రకారం, ఏడు కీలక నగర పాలక సంస్థలకు మేయర్ అభ్యర్థులను ఖరారు చేశారు.
విజయనగరం (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): కోలగట్ల శ్రావణి (వైశ్య)
విశాఖపట్నం (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): వరుదు కల్యాణి (కాపు వెలమ)
ఏలూరు (బీసీ): గంటా మోహన్ రావు (తూర్పు కాపు)
మచిలీపట్నం (బీసీ – మహిళ): లంకా జ్యోతి (తూర్పు కాపు)
ఒంగోలు (అన్‌రిజర్వ్‌డ్): కుప్పం ప్రసాద్ (వైశ్య)
నెల్లూరు (అన్‌రిజర్వ్‌డ్): ఆనం విజయ్ కుమార్ రెడ్డి (రెడ్డి)
కడప (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): బండి దీప్తిరెడ్డి (రెడ్డి)

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ అభ్యర్థులు:
రాష్ట్రవ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా:
ఇచ్ఛాపురం (బీసీ – మహిళ): పిలక రాజ్యలక్ష్మి (రెడ్డిక)
పలాస-కాశీబుగ్గ (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): తలసు శ్రీ పద్మ (కళింగ వైశ్య)
నర్సీపట్నం (బీసీ – మహిళ): చింతకాయల అనిత (కాపు వెలమ)
యలమంచిలి (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): బొద్దపు తులసి (కాపు)
తుని (బీసీ – మహిళ): పిట్ల రామ తులసి (శెట్టిబలిజ)
కొవ్వూరు (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): మన్నె పద్మ (కమ్మ)
రామచంద్రాపురం (బీసీ): చింతపల్లి నాగేశ్వరరావు (శెట్టిబలిజ)
కొండపల్లి (ఎస్సీ – మహిళ): నల్లమోతు తేజస్విని (మాదిగ)
తెనాలి (అన్‌రిజర్వ్‌డ్): మద్దాలి శేషాచలం (వైశ్య)
చీరాల (ఎస్సీ – మహిళ): డాక్టర్ ఇస్తార్ల షెర్లీ (మాల)
బద్వేల్ (అన్‌రిజర్వ్‌డ్): రాచపూడి వెంకట సాయి కృష్ణ (వైశ్య)
ప్రొద్దుటూరు (అన్‌రిజర్వ్‌డ్): పొర్రెడ్డి నరసింహారెడ్డి (రెడ్డి)
పులివెందుల (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): వైయస్ ప్రమీలమ్మ (రెడ్డి)
మదనపల్లె (బీసీ): జింకా చలపతి (బోయ)

నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థులు:
యలేశ్వరం (ఎస్సీ – మహిళ): బదిరెడ్డి ఆశాలత (మాదిగ)
వుయ్యూరు (ఎస్సీ): పైడముక్కల దివ్య (మాదిగ)
గురజాల (అన్‌రిజర్వ్‌డ్): పోలు వీరారెడ్డి (రెడ్డి)
కనిగిరి (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): పులి శాంతి రెడ్డి (రెడ్డి)
బుచ్చిరెడ్డిపాలెం (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): షేక్ షకీలా బేగం (ముస్లిం)
కమలాపురం (అన్‌రిజర్వ్‌డ్ – మహిళ): మార్జుల కవిత (రెడ్డి)

పార్టీ విడుదల చేసిన ఈ జాబితాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 27 స్థానాల్లో 14 స్థానాలు మహిళలకే కేటాయించడం విశేషం. అదేవిధంగా, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు కూడా గణనీయమైన సంఖ్యలో అవకాశాలు ఇచ్చారు. ఈ ప్రకటనతో ఆయా నగరాలు, పట్టణాల్లో ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. పార్టీ ప్రకటించిన అభ్యర్థులు త్వరలోనే నామినేషన్లు దాఖలు చేసి, ప్రచార బరిలోకి దిగనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |