UPDATES  

NEWS

 స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్..!

ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను నియమించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పడం, కమిటీలను ఎంపిక చేయడం చకచకా జరిగింది. ఆయా కమిటీలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్

ఏపీలో స్థానిక సంస్థలకు వచ్చేవారం నోటిఫికేషన్ రానుంది. ఎన్నికలపై న్యాయస్థానాల నుంచి అడ్డంకులు తొలగిపోవడంతో రాజకీయ పార్టీలు వేగంగా పావులు కుదుపుతున్నాయి. మేయర్, మున్సిపల్ ఛైర్మన్, జెడ్పీ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నిక కావడంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. ఈసారి 100 శాతం స్ట్ర్రైక్ రేటు సాధించాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది.

కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

Advertisement

వచ్చేవారం 13 లేదా 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు చకచకా అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ముఖ్య నాయకులతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమీక్ష చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నేతలు ఉంటారు. జనసేన జనసేన ఎమ్మెల్యే లేకుంటే ఎంపీలు ఆధ్వర్యంలో కమిటీలు పని చేయనున్నాయి.

ప్రతి అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం ఉండేలా జనసేన ప్లాన్

మిగతా ప్రాంతాల్లో సీనియర్ నాయకులు ఆ బాధ్యతలు తీసుకుంటారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం ఉండేలా 32 మందితో నిర్వాహక్ దళ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషించేలా శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు పని చేస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కమిటీలు కొనసాగుతాయి. దీంతోపాటు దాదాపు ఐదు రకాల కమిటీలను నియమించారు అధినేత పవన్ కల్యాణ్.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |