UPDATES  

NEWS

 ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో కరువు ఛాయలు.. ఈనెల 12న మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ..!

ఎల్‌నినో దెబ్బకు వర్షాలు మొహం చాటేయడం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు అలుముకోవడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమవుతోంది. వర్షపాతం తగ్గడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ నెల 12న మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

 

ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగం, సాగునీరు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, విపరీతంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలి? తక్షణమే చేపట్టాల్సిన సహాయక చర్యలేంటి? అనే దానిపై ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 235 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉండి వర్షాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరారు.

మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రూపొందించిన ప్రణాళికతో పాటు, రాబోయే రోజుల్లో నిర్వహించే అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చే సలహాలు, సూచనలను ఈ భేటీలో చర్చించనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, కష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |