UPDATES  

NEWS

 ఏపీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతం ఖరారు: కేబినెట్ కీలక నిర్ణయం

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత సహా పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో, మొత్తం ఎనిమిది కేటగిరీలలో బీసీలకు కేటాయించే రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేశారు.

గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో వార్డు మెంబర్లకు 26.73%, సర్పంచ్ పదవులకు 27.95% చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. వీటితో పాటు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) స్థానాలకు 25.55%, మండల పరిషత్ అధ్యక్ష (MPP) పదవులకు 24.60% నిర్ణయించారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) స్థానాలకు 24.60% ఖరారు చేయగా, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు 23.08% మేర రిజర్వేషన్లు కల్పించారు.

పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో సైతం బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారు. అర్బన్ వార్డు సభ్యులకు 32.78% రిజర్వేషన్లు ఖరారు చేయగా, మున్సిపల్ చైర్మన్ పదవులకు 33.02% కేటాయించారు. కార్పొరేషన్ స్థాయిలోని మేయర్ పదవులకు అత్యధికంగా 35.29% బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

సామాజిక వర్గం రిజర్వేషన్ శాతం
ఎస్సీ (SC) – మొత్తం 15%
ఎస్టీ (ST) 6%
బీసీ-A 7%
బీసీ-B 10%
బీసీ-C 1%
బీసీ-D 7%
బీసీ-E 4%
మొత్తం సామాజిక రిజర్వేషన్లు 50%
ఓపెన్ / అన్‌రిజర్వుడ్ కేటగిరీ 50…..

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |