UPDATES  

NEWS

 కేటీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బయలుదేరిన బీఆర్‌ఎస్ కీలక నాయకత్వాన్ని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి పయనమైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేల వాహనాల కాన్వాయ్‌ను మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. వారిని అరెస్ట్ చేసి బోయిన్ పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ క్రమంలో పోలీసుల తీరుపై కేటీఆర్, హరీశ్ రావులు మండిపడ్డారు. శాంతియుతంగా వెళుతున్న తమను ఏ ప్రాతిపదికన అడ్డుకుంటున్నారని నిలదీస్తూ కేటీఆర్, హరీశ్‌ రావు రోడ్డుపైనే నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. 

ప్రతిపక్ష నేతలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా… ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే శాంతిభద్రతల పరిరక్షణకు విధుల్లో ఉన్నామని పోలీసులు తెలిపారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కేటీఆర్, హరీశ్‌ రావు సహా ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |