UPDATES  

NEWS

 కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం..!

జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ యాసిర్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన భారత భద్రతా బలగాలు తెలిపాయి. సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లా, యుస్మార్గ్ ఎగువ ప్రాంతాలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో సంయుక్తంగా ఈ నిఘా ఆధారిత గాలింపు చర్యలు చేపట్టిన ఇండియన్ ఆర్మీ (53 రాష్ట్రీయ రైఫిల్స్), స్పెషల్ ఫోర్సెస్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో యాసిర్ అంతమైనట్టు భద్రతా భలగాలు ప్రకటించాయి.

గతంలో లష్కరే తోయిబాకు చెందిన ‘సులేమాన్ మూసా’ గ్రూపులో కీలక సభ్యుడిగా యాసిర్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. యాసిర్‌కు పూంచ్‌లో ఐఏఎఫ్ (IAF) కాన్వాయ్‌పై జరిగిన దాడి, సోనామార్గ్ మరియు బోటా పత్రి ప్రాంతాలలో జరిగిన ఉగ్ర దాడులతో సంబంధం ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఎన్‌కౌంటర్ జరిగిన పీర్ పంజాల్ శ్రేణిలోని కొండలు, గుహల మధ్య ‘మూసా’ అనే మరో ఉగ్రవాది దాక్కున్నట్లు సమాచారం ఉండటంతో, అతని కోసం పోలీసు భలగాలు మరింత ఉధృతంగా గాలిస్తున్నారు. ఈ లష్కర్ కమాండర్ నిర్మూలనను జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దెబ్బతీయడంలో భద్రతా బలగాలకు లభించిన అతిపెద్ద విజయంగా అధికారులు భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |