UPDATES  

NEWS

 ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల..!

ఏపీలో మున్సిపల్ చట్టాల సవరణ అమల్లోకి తీసుకువచ్చారు. ఇది ఆగస్టు 28 నుంచి Act No.22 of 2026 నుండి అమలు చేయనున్నారు. మున్సిపల్ చట్టాల సవరణపై ప్రభుత్వం మూడు కీలక జీవోలు విడుదల చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కొత్త నిబంధనలు తెచ్చింది. దీంతో కార్పొరేషన్ తొలి సమావేశం జరిగిన 15 రోజుల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలని పేర్కోంది.

డిప్యూటీ మేయర్ ఎన్నికలో విప్ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. విప్ ధిక్కరిస్తే కౌన్సిలర్ సభ్యత్వం రద్దు చేయబడుతుందని, ఎన్నికకు ముందు రోజు ఉదయం 11 గంటల్లోపు విప్ పత్రం సమర్పణ చేయాలని కొత్త నిభందనలో తెలిపింది. ఓకవేల సమాన ఓట్లు వస్తే లాటరీ పద్దతి ద్వారా విజేత ఎంపిక చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఓక వేల డిప్యూటీ మేయర్ పదవి ఖాళీ అయితే 6 నెలల్లోపు భర్తీ చేయాలని పేర్కోన్నారు. దీనికోసం మేయర్ ఎన్నికకు డిపాజిట్ రూ.5 వేలు SC, ST, BCలకు మేయర్ ఎన్నిక డిపాజిట్ రూ.2,500 గా ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 2026 రూల్స్ జారీ అయ్యాయి. మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలకు కొత్త నిబంధనలు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో EVMల వినియోగం ఉంటుందని అధికారులు తెలిపారు. మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలకు ప్రత్యేక ఓటింగ్ విధానం ఉంటుదని మున్సిపల్ ఎన్నికల్లో NOTAకు అవకాశం కల్పించారని తెలిపారు. EVMల సీల్స్‌పై అభ్యర్థుల ఏజెంట్లకు పరిశీలన హక్కు ఉంటుందని, కౌంటింగ్‌పై అభ్యర్థులకు రీకౌంటింగ్ అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల ఖర్చుల లెక్కలు రోజువారీగా నిర్వహించాలని, 1/6 కంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ జప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |