UPDATES  

NEWS

 కాకినాడ మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన ఏమైంది..? వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది..?

కాకినాడ మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన ఏమైంది? మూడు రోజుల తర్వాత చిన్నారి వెళ్లిన పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసింది. మరి చిన్నారి ఎక్కడ? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. పాప కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. తమ కూతురు వస్తుందని తల్లిదండ్రులు, వారి బంధువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం వ్యవహారంలో కొత్త మలుపు

 

కాకినాడ జిల్లా తునిలో మూడేళ్ల జ్ఞానేశ్వరి అనే చిన్నారి కనిపించలేదు. నాలుగు రోజుల కిందట అంటే శనివారం ఉదయం నుంచి చిన్నారి జాడ తెలియలేదు. పెంపుడు కుక్కతోపాటు చిన్నారి ఇద్దరు కనిపించకుండా పోయారు. ఈ విషయం గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి 500 ఎకరాల అటవీ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు.

 

పాప కోసం మూడు రోజులుగా గాలింపు తీవ్రతరం చేశారు. మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని ఓ కొండ వైపు నుంచి పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసింది. దాన్ని చిన్నారి కుటుంబసభ్యులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి తిరిగి పారిపోయింది. పాప ఆచూకీ కోసం పోలీసులు కొండ చుట్టూ గాలిస్తున్నారు. పెంపుడు కుక్క గురించి తల్లిదండ్రులు కొన్ని విషయాలు బయట పెట్టారు.

 

వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? మరి చిన్నారి ఎక్కడ?

 

కుక్క రావడంతో పాప వెనక్కి వస్తుందని తాము ఆనందానికి గురయ్యామని, క్షణాల్లో ఆలోచనలు ఆవిరైపోయానని చెప్పుకొచ్చారు. అందరూ ఒక్కసారిగా అలర్ట్ కావడంతో భయంతో కుక్క పారిపోయిందన్నారు. ఇది వరకు కుక్క ఎప్పుడూ అలా చేయలేదంటున్నారు. పోలీసుల జాగిలాలు రంగంలోకి దిగాయి. దీనికితోడు రెండు రోజులుగా వర్షం పడుతుండడంతో గాలింపుకు కాస్త ఆటంకంగా మారింది.

 

సీహెచ్‌ అగ్రహారానికి చెందిన సుంకర గణేష్-భవాని దంపతులకు మూడేళ్లు కుమార్తె జ్ఞానేశ్వరి ఉంది. ఈ దంపతులు గ్రామ శివార్లలోని ఓ పామాయిల్‌ తోటకు కాపలాదారులుగా ఉన్నారు. శనివారం నుంచి కూతురు కనిపించకపోవడంతో దంపతులు వెతికారు. కంగారు పడిన భవానీ దంపతులు చుట్టు పక్కల వారికి సమాచారం అందించారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |