UPDATES  

NEWS

 మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: పెమ్మసాని..

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, వారి ఆర్థిక సాధికారతను పెంపొందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విజయవాడలో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘నేషనల్ సరస్ ప్రదర్శన’ ఏర్పాట్లను రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడమే ధ్యేయంగా నేషనల్ సరస్ మేళాను ఢిల్లీ నుంచి విజయవాడకు తీసుకువచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం 350కి పైగా స్టాళ్లను సిద్ధం చేస్తున్నామని, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు 250 స్టాళ్లు ఉండబోతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల విజయగాథలు, అనుభవాలను పంచుకునేలా ఈ మేళాను ఒక ప్రత్యేక ‘లెర్నింగ్ సెంటర్’గా మలుస్తున్నామని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులకు గుర్తింపు కల్పించేందుకు ‘స్వయం ఏపీ’ అనే ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. దీని ద్వారా బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అంశాల్లో మహిళలకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. దసరా ఉత్సవాల వేళ విజయవాడకు ఈ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, సందర్శకుల సౌకర్యాలు, భద్రత మరియు పార్కింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |