UPDATES  

NEWS

 ఈ కూటమికి తిరుగుండదు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. 

వ్యవస్థలను బలోపేతం, విలువలను కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే ఈ కూటమికి తిరుగు ఉండదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సాధించిన విజయం ప్రజలదేననన్నారు. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమన్నారు. ఏపీ పునర్ నిర్మాణం కోసం ఏర్పడిన కూటమని మనసులోని మాట బయటపెట్టారు.

 

ఈ కూటమికి తిరుగుండదు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’ పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటాలన్నారు.

 

మరొకటి ప్రాంతీయత పరిమితులను దాటాలన్నారు. మనందరు భారతీయత వైపు అడుగులు వేయాలన్నారు. కూటమిలో జనసేన కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుందని చాలామంది విమర్శించారని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 100 స్ట్రైక్‌ రేట్‌ సాధించామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు వివరించారు.

 

రాష్ట్రాలు కులాలు, ప్రాంతీయత పరిమితులు దాటాలి- డిప్యూటీ సీఎం

 

పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా ఆపామని, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించారని తెలిపారు. ఈనెల 9న జరగాల్సిన ఈ కార్యక్రమం శుక్రవారం జరుపుకొంటున్నామని చెబుతూనే ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయనిర్ణేతలు ప్రజలేనని తేల్చేశారు డిప్యూటీ సీఎం అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |